Tall man: కాబూల్ పొడగరికి గది ఇవ్వలేమంటున్న లక్నో హోటళ్లు!

  • లక్నోలో ఆఫ్ఘన్ కు చెందిన షేర్ ఖాన్ కష్టాలు
  • క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వచ్చిన 8 అడుగుల 2 అంగుళాల పొడగరి  
  • ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో స్థానిక హోటల్లో బస
తన ఎత్తు తనకే ప్రతికూలంగా మారింది. లక్నో లో హోటల్ రూం దొరకడానికి ఇబ్బందిగా మారింది. ఎనిమిది అడుగుల రెండు అంగుళాల ఎత్తున్న ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ కు చెందిన షేర్ ఖాన్,  యూపీ రాజధాని లక్నో వేదికగా తన దేశ జట్టుకు, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్  చూడటానికి వచ్చాడు. అయితే,  స్థానిక హోటళ్లు అతనికి గదిని ఇవ్వడానికి నిరాకరించాయి. అంత ఎత్తున్న షేర్ ఖాన్ కు తమ హోటళ్లలోని గదులు సౌకర్యంగా ఉండవని తెలిపాయి. మరికొన్ని హోటళ్లు అతడిని అనుమానాస్పద వ్యక్తిగా చూశాయి.

 దీనితో ఆ పొడగరి స్థానిక పోలీసులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు షేర్ ఖాన్ కు సమీపంలోని రాజధాని హోటల్ లో బసను కల్పించారు.  తనకిచ్చిన గది సౌకర్యంగా లేదని ఖాన్ సిబ్బందికి చెప్పాడు. బెడ్ తోపాటు, బాత్ రూం, కుర్చీలు ఏవీ కూడా తన శరీరానికి తగ్గట్లు లేవని చెప్పాడు. మరోవైపు ఈ పొడగరి హోటల్ లో బసచేశాడని తెలుసుకున్న స్థానికులు అతన్ని చూడటానికి హోటల్ ముందు భారీ సంఖ్యలో గుమికూడారు. ఈ నేపథ్యంలో అతడు మ్యాచ్ జరుగుతున్న ఎకానా స్టేడియం చేరుకునేందుకు పోలీసులు ఎస్కార్ట్ గా నిలిచారు.  
Tall man
Afghanisthan
at Luknow
cricket mach
westindies vs Afghanisthan
hotels rejecting to give room

More Telugu News