విజయారెడ్డి హత్యకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణం: వీహెచ్

07-11-2019 Thu 13:52
  • లంచం అడిగే అధికారులను కొట్టాలని గతంలో కేసీఆర్ చెప్పారు
  • విజయారెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
  • రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాలి

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈరోజు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు లంచం అడిగితే కొట్టాలంటూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణమని ఆరోపించారు. విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రెవెన్యూ కార్యాలయాలకు ఒక కానిస్టేబుల్ తో భద్రత కల్పించాలని చెప్పారు. రెవెన్యూ శాఖలో లోటుపాట్లు, భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.