silver: రహదారిపై వెండిపూసలు.. ఎగబడి తీసుకుని ఇంటికెళ్లిపోయిన స్థానికులు

  • బీహార్ లోని సుర్సంద్ లో ఘటన
  • పారేసుకుని వెళ్లిన స్మగ్లర్లు
  • నేపాల్ నుంచి తెచ్చి భారత్ లో విక్రయిస్తోన్న స్మగ్లర్లు
రహదారిపై స్థానికులకు వెండి పూసలు దొరికిన ఘటన బీహార్ లోని సుర్సంద్ లో చోటు చేసుకుంది. వెండి పూసలన్నింటినీ ఏరుకొని స్థానికులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. రాత్రి సమయంలో కొందరు అక్రమ రవాణా చేస్తుండగా వెండి పూసలు రహదారిపై పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.

నేపాల్ నుంచి అక్రమంగా వెండిని తెచ్చి కొందరు స్మగ్లర్లు భారత్ లో విక్రయిస్తున్నారు. వారు పడేసుకున్న వెండిపూసలను ఏరుకోవడంలో చిన్నారులు కూడా ఉత్సాహం కనబర్చారు. గ్లాసుల్లో, జేబుల్లో వాటిని వేసుకొని ఇంటికెళ్లారు.
silver
bihar

More Telugu News