Chiranjeevi: పాట చిత్రీకరణతో మొదలుకానున్న చిరూ మూవీ షూటింగ్

  • చిరూ 152వ సినిమాకి సన్నాహాలు 
  • ప్రాచీన దేవాలయాల నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా తెరపైకి 'త్రిష' పేరు

చిరంజీవి 152వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్ షూటింగును పాట చిత్రీకరణతో మొదలు పెడుతున్నట్టుగా సమాచారం. ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది ఇంట్రడక్షన్ సాంగ్ కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ప్రాచీన దేవాలయాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ అని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. ఒక కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది. మరో కథానాయిక ఎంపిక జరగవలసి వుంది. ఓ ముఖ్యమైన పాత్రలో ఈషా రెబ్బా కనిపించనుందని కూడా చెప్పుకుంటున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తారట.

  • Loading...

More Telugu News