Jagan: అగ్రిగోల్డ్ బాధితులకు నేడు గుంటూరులో జగన్ చెక్కుల పంపిణి

  • రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెక్కులు
  • రూ.14.09 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • దీక్షలను రద్దు చేస్తామన్న బాధిత సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల
గుంటూరులో నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అగ్రిగోల్డ్‌లో పదివేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారు జిల్లాలో 19,751 మంది ఉన్నారు. వీరందరికీ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.14.09 కోట్లు విడుదల చేసింది.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు దానిని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని  అగ్రిగోల్డ్‌ ఏజెంట్స్‌ అండ్‌ కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో  తలపెట్టిన దీక్షలను రద్దు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Jagan
agrigold
Guntur District
Andhra Pradesh

More Telugu News