Ambati Rambabu: వైసీపీపై బురద చల్లడానికి టీడీపీ చెడ్డీ గ్యాంగ్ బయల్దేరింది: అంబటి రాంబాబు విమర్శలు

  • అమరావతిని సర్వనాశనం చేశారని ఆరోపణ
  • భ్రమరావతిలా చూపించారంటూ వ్యాఖ్యలు
  • పవన్ పైనా విమర్శలు చేసిన అంబటి
రాజధాని పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారంటూ టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అమరావతిని భ్రమరావతిలా చూపించారని, ఇసుక దోచుకున్న చంద్రబాబే దీక్ష చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ఇప్పుడు వైసీపీపై బురదజల్లడానికి టీడీపీ చెడ్డీ గ్యాంగ్ బయల్దేరిందని వ్యాఖ్యానించారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ పైనా అంబటి విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ సినిమాల్లోనే హీరో అని, రాజకీయాల్లో విలన్ అని వ్యాఖ్యానించారు. ప్రతిదానికీ తాట తీస్తాననడం రాజకీయ నాయకుడి సంస్కారం కాదని హితవు పలికారు. పవన్ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Ambati Rambabu
YSRCP
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan
Telugudesam
Telugudesam

More Telugu News