Chittoor District: చిత్తూరు జిల్లా ఎమ్మార్వో కార్యాలయంలో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతు కుటుంబం బెదిరింపు

  • చిత్తూరు జిల్లా రామకుప్పం ఎమ్మార్వో కార్యాలయంలో ఘటన
  • కుటుంబంతో సహా వచ్చిన ఓ రైతు
  • తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య తర్వాత తమ కార్యాలయాలకు వస్తున్న రైతులను చూసి రెవెన్యూ సిబ్బంది భయపడుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎమ్మార్వో కార్యాలయంలో ఓ రైతు తన కుటుంబంతో సహా వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం కలకలం రేపింది.

 తగరాలతండాలో ఉన్న తమ భూమిని అధికారులు ఇతరులకు పట్టా చేశారని... ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి, ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు. దీంతో అక్కడి ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు.
Chittoor District
Farmer
Suicide Attempt

More Telugu News