VH: టీఆర్ఎస్ ప్రభుత్వ పొరబాట్లే తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు కారణం: వీహెచ్

  • తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం
  • స్పందించిన వీహెచ్
  • నిందితుడు సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అంటూ ఆరోపణ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. విజయారెడ్డి హత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వ పొరబాట్లే కారణమని ఆరోపించారు. విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అని తెలిపారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం తెలంగాణలో విజయారెడ్డి అనే తహసీల్దార్ ను సురేశ్ అనే వ్యక్తి ఆమె కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం అన్ని వర్గాల వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
VH
TRS
Vijayareddy
Abdullapurmet

More Telugu News