LV Subrahmanyam: కొత్త బాధ్యతలను స్వీకరించకుండా సెలవుపై వెళ్లిపోయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • తాత్కాలిక సీఎస్ కు బాధ్యతలను అప్పగించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • వచ్చే నెల 6వ తేదీ వరకు సెలవు పెట్టిన వైనం
  • సోమవారం సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తాత్కాలిక సీఎస్ నీరబ్ కుమార్ కు ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పగించారు. మరోవైపు, బాపట్లలో హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
LV Subrahmanyam
Leave

More Telugu News