New Delhi: న్యూఢిల్లీ మ్యాచ్ లో వాంతులు చేసుకున్న బంగ్లా క్రికెటర్లు

  • వెల్లడించిన ‘ఈఎస్‌పీఎన్‌ క్రిక్ఇన్ఫో’
  • బ్యాట్స్‌మెన్‌ సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా ఆటగాడు వాంతులు 
  • ఢిల్లీలో వాయు కాలుష్యమే కారణం
ఇటీవల ఢిల్లీలో బంగ్లాదేశ్ తో టీమిండియా టీ20 మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ అక్కడే మ్యాచ్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా ఆటగాడు వాంతులు చేసుకున్నాడట. ఈ విషయాన్ని ‘ఈఎస్‌పీఎన్‌ క్రిక్ఇన్ఫో’ తెలిపింది.

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరుకున్నప్పటికీ ఆ నగరంలోనే మ్యాచ్ నిర్వహించడం పట్ల బీసీసీఐపై పర్యావరణ ప్రేమికులు విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా మ్యాచ్ కు ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీం మాట్లాడుతూ.. ఢిల్లీ కాలుష్యం తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చాడు.
New Delhi
Cricket
Bangladesh
India

More Telugu News