infosys: ఉద్యోగుల తీవ్ర ఆరోపణలకు సమాధానమిస్తూ ప్రకటన చేసిన ఇన్ఫోసిస్‌

  • ఆదాయాలు తప్పుగా చూపుతున్నారంటూ ఇటీవల తీవ్ర ఆరోపణలు 
  • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఇన్ఫోసిస్
  • తాము ఆధారాలు అందుకోలేదని స్పష్టం  

ఆదాయాలు, నికర లాభాలను తప్పుగా చూపుతున్నారంటూ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ ఓ ప్రకటన చేసింది. కంపెనీ సహ వ్యవస్థాపకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. గత నెలలో తమ సంస్థ ఉద్యోగులు కొందరు రాసిన లేఖలో పేర్కొన్న ఆరోపణలపై తాము ఆధారాలు అందుకోలేదని స్పష్టం చేసింది.

కాగా, తమ సంస్థ సీఈఓ సలిల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ లపై ఆరోపణలు చేస్తూ కొందరు ఉద్యోగుల బృందం రాసిన లేఖ  ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. లాభాలు తగ్గుముఖం పడితే షేర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయంతో సలీల్‌ పరేఖ్‌ భారీ ఒప్పందాలకు అనుమతులు ఇవ్వరాదని తమపై ఒత్తిడి చేశారని వారు ఆరోపించారు.

More Telugu News