KTR: కేటీఆర్ ను ఉద్దేశించి తెలుగులో ట్వీట్ చేసిన యూకే డిప్యూటీ హై కమిషనర్!

  • త్వరలో కేటీఆర్ ను యూకే తీసుకెళ్తా
  • తెలంగాణ వ్యాపార విధానాలను వివరించాలని కోరుతున్నా
  • ఏపీ, టీఎస్ డిప్యూటీ హై కమిషనర్ గా ఉన్న ఫ్లెమింగ్
తెలుగు రాష్ట్రాల్లో యూకే డిప్యూటీ హై కమిషనర్ గా పనిచేస్తున్న ఆండ్ర్యూ ఫ్లెమింగ్, తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి తెలుగులో ట్వీట్ చేయగా, అదిప్పుడు వైరల్ గా మారింది. "త్వరలో కేటీఆర్ గారిని యూకే తీసుకు వెళ్ళగలనని ఆశిస్తున్నా. అక్కడ  బ్రిటిష్ వ్యాపారవేత్తలకు కూడా తెలంగాణ వ్యాపార విధానాలను వివరిస్తారని కోరుకుంటున్నా" అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఇటీవల ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులతో సమావేశమైన కేటీఆర్ కు చెందిన వార్త క్లిప్ ను ఆయన జోడించారు.
KTR
UK
Dy High Commissioner
Twitter
Andrew Fleming

More Telugu News