గడువు ముగిసినా... టీఎస్ ఆర్టీసీ విధుల్లో చేరింది 360 మందే!
- 33వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
- విధుల్లో చేరిన 200 మంది బస్ భవన్ సిబ్బంది
- కొనసాగుతున్న కార్మికుల నిరసనలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 62 మంది, హైదరాబాద్ జోన్ లో 31 మంది, ఇతర డిపోల్లో మిగతావారు విధుల్లోకి చేరేందుకు ముందుకు వచ్చారు. ఇక ఆర్టీసీ సమ్మె నెల రోజులకు పైగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో బస్సులు తిరగకపోవడంతో తమ గమ్యస్థానానికి చేరలేకపోతున్నారు. సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులు వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు. నేటితో సమ్మె 33వ రోజుకు చేరగా, కార్మికులు సైతం సమ్మెను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.