చైనా ఓపెన్... అనామకురాలి చేతిలో పీవీ సింధుకు ఘోర పరాభవం!
- తొలి రౌండ్ లోనే పరాజయం
- సింధును ఓడించిన పాయ్ యు
- వరుస తప్పులు చేసిన సింధు
తొలి రౌండ్ మ్యాచ్ లో 13-21, 21-18, 19-21 తేడాతో సింధును పాయ్ మట్టి కరిపించింది. తొలి సెట్ ను పాయ్ గెలుచుకున్నా, ఆపై పుంజుకున్న సింధూ, రెండో సెట్ ను గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో సింధూ చేతులెత్తేయడంతో ఈ టోర్నీ నుంచి ఆమె వెనుదిరిగింది. దాదాపు గంటంబావు పాటు మ్యాచ్ సాగింది. మూడో సెట్ లో 15-12 ఆధిక్యంలో ఉన్న సింధు, ఆపై మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లినా, వరుసగా తప్పులు చేసి ఓటమి చవిచూసింది.