JSV Prasad: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ... కొత్త ఈఓగా జేఎస్వీ ప్రసాద్!

  • ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖలో ప్రసాద్
  • ప్రసాద్ స్థానంలో సతీశ్ చంద్ర నియామకం
  • నేడో, రేపో టీటీడీ ఈఓ మార్పు ఉత్తర్వులు
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడో, రేపో దీనిపై అధికారిక ప్రకటన విడుదల అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జేఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధుల్లో ఉన్నారు. అదే పదవికి ప్రసాద్ స్థానంలో సతీశ్ చంద్రను నియమిస్తున్నట్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ప్రసాద్ కు టీటీడీ బాధ్యతలను అప్పగించడమే తరువాయని సమాచారం. గతంలో జేఎస్వీ ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా సేవలందించారు. ఇక అనిల్ కుమార్ కు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయమై స్పష్టత రావాల్సివుంది.
JSV Prasad
Anil Kumar Singhal
TTD
Tirumala
Tirupati
EO

More Telugu News