BJP: మీరు కలగజేసుకోవాలి: ఆరెస్సెస్ చీఫ్ కు శివసేన లేఖ

  • బీజేపీ-శివసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారు
  • కూటమి ధర్మాన్ని బీజేపీ విస్మరించింది
  • మీరు కలగజేసుకుని సమస్యకు ముగింపు పలకండి

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ-శివసేనల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సీఎం పదవి విషయంలో రెండు పార్టీలు పట్టు వీడకపోవడంతో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కు శివసేన నేత కిశోర్ తివారీ లేఖ రాశారు. సమస్యకు ముగింపు పలికేందుకు తమరు కలగజేసుకోవాలంటూ లేఖలో మోహన్ భగవత్ ను కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కిశోర్ తివారీ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారని... కానీ కూటమి ధర్మాన్ని పాటించడంలో బీజేపీ విఫలమైందని లేఖలో కిశోర్ తివారీ ఆరోపించారు. బీజేపీ తీరుతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఆరెస్సెస్ కలగజేసుకుని సమస్యకు ముగింపు పలకాలని కోరారు. అయితే, కిశోర్ తివారీ లేఖపై ఆరెస్సెస్ ఇంతవరకు స్పందించలేదు.

More Telugu News