ఏపీలోని 'అమ్మ ఒడి' పథకానికి మరో నిబంధన.. 75 శాతం హాజరు తప్పనిసరి!
- ఏడాదికి రూ. 15 వేల సాయం
- కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి
- విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరి
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కచ్చితంగా ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు. తాజాగా ఈ పథకానికి సంబంధించి మరో షరతును విధించారు. 75 శాతం హాజరు కలిగిన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. చదువును విద్యా సంవత్సరం మధ్యలోనే ఆపివేసే విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించనున్నారు.