china: అల్జీమర్స్ కు అద్భుత ఔషధాన్ని తయారుచేసిన చైనా.. వచ్చే నెలలోనే మార్కెట్లోకి!

  • 22 ఏళ్ల పరిశోధన తర్వాత సాధించిన చైనా
  • వచ్చే నెల 29 నుంచి మార్కెట్లోకి జీవీ-971 ఔషధం
  • ఓ మోస్తరు మతిమరుపు ఇట్టే దూరం

అల్జీమర్స్ (వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు)తో బాధపడేవారికి ఇది గొప్ప శుభవార్తే. అల్జీమర్స్ వ్యాధికి తొలిసారిగా చైనా ఓ పూర్తిస్థాయి ఔషధాన్ని తయారుచేసింది. దీనిపేరు జీవీ-971. డిసెంబరు 29 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ వ్యాధిని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుల కంపెనీలు 20 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాయి. ఇందుకోసం వందల కోట్ల రూపాయలను వెచ్చించి మొత్తం 320కి పైగా మందులను తయారుచేశాయి. అయితే, వీటిలో చైనా తయారుచేసిన జీవీ-971 అనే సమగ్ర ఔషధం ఒక్కటే క్లినికల్ పరీక్షలను తట్టుకుని నిలబడగలిగింది. వచ్చే నెల నుంచే ఇది అందుబాటులోకి రాబోతోంది. గోధుమ రంగులో ఉండే ఆల్గే నుంచి సేకరించిన ఈ ఔషధం ఓ మోస్తరు అల్జీమర్స్‌ను నయం చేస్తుందని తేలింది.

22 ఏళ్ల పరిశోధన అనంతరం చైనాలోని షాంఘై ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియా మెడికా, గ్రీన్‌వ్యాలీ అండ్ ఓషన్ యూనివర్సిటీ సంస్థలు దీనిని రూపొందించాయి. అల్జీమర్స్ అనేది మెదడులోని ఆలోచనా సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తినీ హరించివేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లమందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇటువంటి వారికి జీవీ-971 దివ్యౌషధమే కానుంది.

  • Loading...

More Telugu News