chris gayle: ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తో చెత్త అనుభవం.. ట్విట్టర్లో విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మండిపాటు

  • కన్ఫర్మ్ టికెట్ ఉన్నావిమానం ఎక్కడానికి అనుమతించడంలేదంటూ ఆవేదన
  • క్షమించండంటూ క్రిస్ ఎమిరేట్ సంస్థ బదులు ట్వీట్
  • బుకింగ్ రిఫరెన్స్ తెలిపితే దర్యాప్తు చే్స్తామన్న ఎమిరేట్స్  

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ పై విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మండిపడ్డాడు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నా.. విమానంలో ఎక్కడానికి అనుమతించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎయిర్ లైన్స్ తీరుతో నిరాశ చెందానని ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వెళ్లగక్కాడు. ‘ఎమిరేట్స్ నా పట్ల ప్రవర్తించిన తీరుకు నిరాశచెందా. నా వద్ద కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ.. ఆ సీట్ అప్పటికే బుక్ అయిపోయిందని చెప్పారు. నేను బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించమంటున్నారు. దీంతో నేను  తర్వాతి విమానంలో ప్రయాణించవలసి ఉంది. ఎమిరేట్స్‌తో చెత్త అనుభవం’ అంటూ ట్వీట్ చేశాడు.

అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఎమిరేట్స్ రీ ట్వీట్

‘మమ్మల్ని క్షమించండి, క్రిస్. దయచేసి మీ బుకింగ్ రిఫరెన్స్ మరియు ఇమెయిల్ చిరునామాను నేరుగా మాకు తెలియజేయండి. ఆప్షన్స్‌ను చెక్ చేసి మీకు తెలియజేస్తాము’ అని ట్వీట్ చేసింది.  

More Telugu News