Bigg Boss: 'బిగ్ బాస్' గ్యాంగ్ తో రాహుల్ సిప్లిగంజ్ వేడుకలు

  • బిగ్ బాస్-3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్
  • రూ.50 లక్షల నగదు బహుమతి అందుకున్న రాహుల్
  • వరుణ్, వితిక, పునర్నవిలతో సరదాలు
బిగ్ బాస్-3 రియాల్టీ షో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో టాలీవుడ్ యువ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి రూ.50 లక్షలు ఎగరేసుకెళ్లాడు. ఇక, షో పూర్తికావడంతో హౌస్ నుంచి బయటికి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ తన బిగ్ బాస్ మిత్రబృందం వరుణ్ సందేశ్, వితిక, పునర్నవిలతో కలిసి ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఈ నలుగురు ఓ గ్యాంగ్ గా ఏర్పడి చివరి వరకు అదే స్నేహబంధం కొనసాగించారు. మధ్యలో రాహుల్, వరుణ్ మధ్య వివాదం వచ్చినా అది టీ కప్పులో తుపాను మాదిరే సమసిపోయింది.
Bigg Boss
Rahul Sipligunj
Varun Sandesh
Vitika Sheru
Punarnavi Bhupalam

More Telugu News