grenade: శ్రీనగర్ లో మళ్లీ గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు

  • ఒకరి మృతి, 15 మందికి గాయాలు
  • గత 15 రోజుల్లో ఇది రెండో దాడి
  • గతనెల 28న జరిపిన ఉగ్ర దాడిలో 19 మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈరోజు మధ్యాహ్నం శ్రీనగర్ లోని మౌలానా ఆజాద్ రోడ్ లోని మార్కెట్ లో గ్రనేడ్ దాడి జరిపారు. ఈ దాడిలో  ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గత 15 రోజుల వ్యవధిలో ఇది ఉగ్రవాదుల రెండో దాడి.

అక్టోబర్ 28న నార్త్ కశ్మీర్ లో సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 19 మంది క్షతగాత్రులయ్యారు. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఉగ్రమూకలు కశ్మీర్ లో భయాందోళనలు సృష్టించేందుకు, గ్రనేడ్లతో దాడులకు పాల్పడుతున్నాయని సైనిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
grenade
attack
terrorists
Jammu And Kashmir
sri nagar

More Telugu News