Jagan: దీన్ని బట్టి చూస్తుంటే, మీరు పూర్తి అభద్రతా భావంలో ఉన్నారని అర్థమవుతోంది: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

  • ఇసుక రాష్ట్రం దాటకుండా నిఘా పెట్టండి
  • మేధావుల నుంచి సామాన్యుల వరకు వ్యతిరేకంగా ఉన్నారు
  • ప్రభుత్వ భూములను అమ్మబోతున్నారనే వార్తలను చదువుతున్నాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. ఇసుక ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరమని... దానికి అడ్డుపడకూడదని లేఖలో సూచించారు. సరైనంత ఇసుకను అందించలేని పరిస్థితుల్లో... కనీసం ఇసుక రాష్ట్రం దాటి బయటకు వెళ్లకుండా నిఘా పెట్టాలని అన్నారు. ఇసుక కొరతతో ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆవేదనకు గురి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఇసుక పాలసీపై రాష్ట్రంలోని మేధావుల నుంచి సామాన్యుల వరకు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ప్రజలు సుఖంగా బతికేలా పాలన ఉండాలని అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం భూములను అమ్మబోతున్నారనే వార్తలను చదువుతున్నామని ముద్రగడ తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పని కొత్త పథకాలను కూడా ప్రవేశ పెడుతున్నారని... వాటి అమలుకు తేదీలను కూడా ప్రకటిస్తున్నారని... కానీ, వాటిలో కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం దారుణమని అన్నారు. ఇది కాపులు చేసుకున్న పాపంగా భావిస్తున్నామని చెప్పారు. మీ పాలనను చూస్తుంటే... మీరు పూర్తి అభద్రతా భావంలో ఉన్నారనే విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News