Prakasam District: చీరాల లారీ స్టాండ్‌ వద్ద ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకుపోయి కారు

  • కారులో నలుగురు ప్రయాణికులు
  • స్వల్పగాయాలతో బయటపడిన బాధితులు
  • ఈరోజు తెల్లవారు జామున ఐదు గంటలకు ఘటన
అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకుపోయిన ఘటన ఈ రోజు తెల్లవారు జామున జరిగింది. అయితే కాల్వలో నీరు తక్కువగా ఉండడంతో కారులో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా చీరాల లారీస్టాండ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే, తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో నలుగురు ప్రయాణికులతో ఓ కారు పరుచూరు నుంచి చీరాల వైపు వస్తోంది. లారీ స్టాండ్‌ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకు పోవడమేకాక బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు బాధితులకు సాయమందించి కారులో నుంచి బయటకు తీశారు.
Prakasam District
chirala
Road Accident
car runaway
water canal

More Telugu News