Amit Shah: అమిత్ షా దృష్టికి ఆర్టీసీ సమస్యలు తీసుకెళతాం: ఆర్టీసీ జేఏసీ

  • జోక్యం చేసుకోవాలని కోరనున్న జేఏసీ
  • ఆర్టీసీ పరిస్థితిని అమిత్ షా కు వివరించనున్న నేతలు
  • ఇప్పటికే బీజేపీ, టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలతో భేటీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యలు వివరించడానికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ సిద్ధమైంది. తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితులు, కొంత కాలంగా కార్మికులు కొనసాగిస్తోన్న సమ్మెను వివరించి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కార్మికులు కోరనున్నారు.

మంగళవారంలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం జేఏసీ నేతలు... రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలను కలిశారు. తాము చేస్తోన్న సమ్మెను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ పరిస్థితిని అమిత్ షా కు వివరిస్తామని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.
Amit Shah
Telangana
rtc

More Telugu News