elephant: ఏనుగులను తరిమేందుకు అసోం వాసుల వినూత్న ఆలోచన!

  • గ్రామాల్లో పడి నానా బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు
  • ఇటీవల ఐదుగురిని తొక్కి చంపిన వైనం
  • పొలాల్లో జిరాఫీ బొమ్మల ఏర్పాటు

తరచూ గ్రామాల్లోకి వచ్చి దాడులకు దిగుతున్న ఏనుగులను తరిమేందుకు అసోం వాసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఏనుగులు ఇటీవల తరచూ గ్రామాల్లోకి వస్తూ దాడులకు తెగబడుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం గోల్పారా జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ గ్రామంపై దండెత్తి ఐదుగురిని తొక్కి చంపాయి. ‘లాడెన్’ అనే ఏనుగు బారినపడి ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏనుగులను తరిమికొడుతున్నప్పటికీ మళ్లీమళ్లీ వస్తుండడంతో అటవీ అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో గ్రామస్థులే వినూత్న ఆలోచన చేశారు. జిరాఫీలు ఉన్న ప్రాంతానికి ఏనుగులు రావన్న ఆలోచనతో పంట పొలాల్లో జిరాఫీ ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇలా జిరాఫీ బొమ్మలు ఏర్పాటు చేసిన తర్వాత ఏనుగుల బెడద కొంత తగ్గిందని చెబుతున్నారు. అయితే, పూర్తిస్థాయి ఫలితాల కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదని గ్రామస్థులు పేర్కొన్నారు.

More Telugu News