ESI Scam: బర్త్‌డే పార్టీలు, పబ్‌లో ఆటపాటలు, విలాస జీవితం.. 'ఈఎస్ఐ స్కాం' నిందితురాలు దేవికారాణి కేసులో కొత్త కోణం

  • ఈఎస్ఐ స్కాంలో శ్రీనివాసరెడ్డి అరెస్ట్
  • విచ్చలవిడిగా వచ్చి పడుతున్న డబ్బుతో జల్సాలు
  • కోట్లకు పడగలెత్తిన సాధారణ ఫార్మసిస్ట్ నాగలక్ష్మి
ఈఎస్ఐ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ దేవికారాణి కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఆమె విలాసవంతమైన జీవితం గడిపినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలాసాల కోసం ఆమె వెచ్చించిన సొమ్ము, అక్రమాస్తులు ఎలా సంపాదించిందీ ఆరాతీస్తున్నారు. అంతేకాదు, సాధారణ ఫార్మసిస్టు అయిన కొడాలి నాగలక్ష్మి కూడా కోట్లకు పడగలెత్తడం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు నిన్న తేజ ఫార్మా ఎండీ సోదరుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు.  

కాగా, అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన నిందితులు దేవికారాణి, నాగలక్ష్మి, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు విలాసాల కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు అధికారులు గుర్తించారు. విచ్చలవిడిగా డబ్బు వచ్చిపడుతుంటే ఏం చేయాలో తోచక జల్సాలకు అలవాటు పడ్డారు. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లలో ఎంజాయ్ చేసినట్టు అధికారుల విచారణలో తేలింది.  

అంతేకాదు, పార్టీలలో దేవికారాణి ప్రత్యేకంగా కనిపించేందుకు ఉబలాటపడేవారు. బ్యూటీషియన్లను పిలిపించుకుని అందంగా తయారయ్యేవారు. డ్యాన్స్‌ మాస్టర్లను పెట్టుకుని డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. పార్టీల్లో డ్యాన్స్‌లు చేస్తూ అందరినీ తనవైపు ఆకర్షించేవారు. ఆత్మరక్షణ కోసం నాన్‌చాక్‌ తిప్పడం కూడా నేర్చుకోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ESI Scam
Devika Rani
Nagalaxmi
Hyderabad
ACB

More Telugu News