Trai: ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని పెంచిన ట్రాయ్

  • ఇన్ కమింగ్ రింగ్ 30 సెకన్లు ఉండాలని ఆదేశం
  • ల్యాండ్ లైన్లకు ఈ సమయం 60 సెకన్లుగా నిర్ణయం
  • టెలికాం సంస్థల మధ్య వివాదానికి తెర

ఇప్పటివరకు  మీ మొబైల్ నుంచి అవతలి వ్యక్తికి చేసే కాల్స్ మిస్డ్ కాల్స్ గా మారుతున్నాయా..? కాల్ చేయగానే  రింగ్ అయినట్టే అయి క్షణాల్లో కట్ అయిపోతుంది కదూ! దీనికి కారణం ఇప్పటివరకు  టెలికాం కంపెనీలు పోటీపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే. ఈ పోటీ తీవ్రంగా పరిణమించడంతో ట్రాయ్( టెలికాం నియంత్రణ సంస్థ) ఈరోజు వినియోగదారులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లలో ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని 30 సెకన్లుగా నిర్ణయించగా, ల్యాండ్ లైన్ ఫోన్లకు ఈ సమయం 60 సెకన్లు ఉండాలని తెలిపింది.

గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు. తొలుత ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. అనంతరం ఎయిర్ టెల్, వోడాఫోన్ లు కూడా పోటీగా 25 సెకన్లుకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ సమస్యలను ఎదుర్కొన్నారు. మిస్డ్ కాల్స్ పెరిగిపోయాయి. తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న అవాంఛనీయ పోటీకి తెరపడినట్టే.

More Telugu News