dollar seshadri: టీటీడీలో డాలర్ శేషాద్రి సేఫ్.. వందమంది అవుట్!

  • అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఉద్వాసన
  • ప్రభుత్వ ఆదేశాలు డాలర్ శేషాద్రికి వర్తించవని ఆలస్యంగా గుర్తించిన అధికారులు
  • నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న దాదాపు వందమంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శ్రీవారి ఆలయ ఓఎస్డీగా ఉన్న డాలర్ శేషాద్రిపైనా వేటు తప్పదని భావించారు. అయితే, తనపై వేటు పడకుండా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. సిబ్బంది తొలగింపు ప్రక్రియను ప్రారంభించిన టీటీడీ నిన్న వందమందికి ఉద్వాసన చెప్పింది. తొలగింపునకు గురైన వారిలో డాలర్ శేషాద్రి పేరు లేకపోవడంతో ఆయన సేఫ్ అయినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉద్వాసనకు గురైన వారి పూర్తి వివరాలు నేడు వెల్లడికానున్నాయి. నిజానికి డాలర్ శేషాద్రి తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు ఆయనకు వర్తించే అవకాశం లేదని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో వాటిని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో డాలర్ శేషాద్రి కొనసాగింపు తథ్యమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News