Bharti Airtel: ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. 3జీ సేవల నిలిపివేత

  • కోల్‌కతా, హర్యానాలలో నిలిచిపోయిన 3జీ సేవలు
  • వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా అమలు
  • 2జీ సేవలు యథాతథం
ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేకపోతున్న ఎయిర్‌టెల్ 3జీ సేవలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అయితే, 2జీ సేవల విషయంలో మాత్రం ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. 2జీ నెట్‌వర్క్ నుంచి ఆదాయం వస్తున్నంత కాలం వాటి సేవలు కొనసాగుతాయిని స్పష్టం చేశారు. అలాగే, 2జీ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు తీసుకొస్తూనే ఉంటామని వివరించారు.

కాగా, కోల్‌కతా, హర్యానాలో ఎయిర్‌టెల్ ఇప్పటికే 3జీ సేవలకు స్వస్తి పలికింది. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో 2జీ, 4జీ సేవలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 3జీ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్టు సంస్థ పేర్కొంది.
Bharti Airtel
3G network
Reliance jio

More Telugu News