Amit Shah: ఢిల్లీలో కొనసాగుతున్న కేటీఆర్ పర్యటన

  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
  • రసూల్ పుర ఫ్లైఓవర్ కు స్థలాన్ని కేటాయించాలని వినతి
  • కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తో సమావేశం
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని రసూల్ పుర వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కొంత స్థలాన్ని ఎస్ఆర్  డీపీ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, అంతర్రాష్ట్ర పోలీస్ వైర్ లెస్ స్టాఫ్ నివాస గృహాలకు చెందిన స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించాలని కోరారు. ఆ స్థలానికి బదులుగా మరో స్థలంలో పోలీసులకు క్వార్టర్స్ నిర్మించి ఇస్తామని కేటీఆర్ చెప్పారు.

ఇక తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంతి పియూష్ గోయల్ ను కూడా కలిశారు..
Amit Shah
KTR
New Delhi

More Telugu News