Varla Ramaiah: పెళ్లికొడుకు లేకుండా పెళ్లేంటి జగన్ గారూ!: వర్ల రామయ్య

  • రాష్ట్రావతరణ పోస్టర్లో పొట్టి శ్రీరాములు ఎక్కడ? అంటూ ప్రశ్నించిన వర్ల
  • రాష్ట్రం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగ ఫలమేనని వెల్లడి
  • తెలుసుకోండి సార్ అంటూ ట్వీట్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ పోస్టర్లో అసలు సూత్రధారి అమరజీవి పొట్టి శ్రీరాములు ఫొటో లేకపోవడం శోచనీయం అని వ్యాఖ్యానించారు. అసలు, పొట్టి శ్రీరాములు గురించి మీ ప్రభుత్వానికి తెలుసా? లేదా? అని ప్రశ్నించారు. "వెనుకటికి ఎవరో పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడట. పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని తెలుసుకోండి సార్!" అంటూ సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు.
Varla Ramaiah
Jagan
Andhra Pradesh
Potti Sriramulu

More Telugu News