adani group: హైదరాబాదులో భారీ డేటా సెంటర్ ఏర్పాటు

  • 13 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును నెలకొల్పనున్న అదానీ గ్రూప్
  •   హైదరాబాద్ లో నెలకొల్పడానికి నిర్ణయం  
  •  శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ రియాల్టీ సంస్థతో ఒప్పందం

హైదరాబాద్ కు భారీ డేటా సెంటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్  రానుంది.  గుజరాత్ కు చెందిన    ప్రముఖ సంస్థ అదానీ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ.92 వేల కోట్లు) వెచ్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకోసం శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ రియాల్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, డిజిటల్ రియాల్టీ మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నామని ప్రకటించింది.

ఈ రెండు సంస్థలు కలిసి దేశ వ్యాప్తంగా డేటా సెంటర్లను అభివృద్ధి చేయడమేకాక వాటిని నిర్వహించనున్నాయి. గతంలో  డేటా సెంటర్ ను విశాఖ పట్టణంలో ఏర్పాటుచేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించినప్పటికి వాస్తవరూపం దాల్చలేకపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యతతో కూడిన ఇంటర్నెట్ సేవలు అందించడానికి డేటా సెంటర్ ను,  ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ తో అనుసంధానిస్తారు.

More Telugu News