ప్రియుడు గొంతు పట్టాడు.. కూతురు నోరు నొక్కింది: మలుపు తిరిగిన కీర్తి కేసు

  • కూతురు కీర్తి, ప్రియుడు శశికుమార్ కిరాతకం
  • సంచలనం రేపిన కన్నకూతురే తల్లిని చంపిన కేసు
  • పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న నిజాలు
సంచలనం రేపిన  కన్నకూతురే తల్లిని హత్య చేసిన కేసు కిరాతక చర్యకు సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్ హయత్ నగర్ లో చోటుచేసుకున్న ఈ కేసులో పోలీసుల విచారణలో పలు నిజాలు బయటపడుతున్నాయి.  ప్రియుడు శశికుమార్ తో కలిసి కీర్తి అనే యువతి తన తల్లి రజితను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యానేరాన్ని తన తండ్రి శ్రీనివాస్ రెడ్డిపై వేసేందుకు ప్రయత్నించింది. వైజాగ్ కు వెళ్లానని చెప్పిన కీర్తి, తనతల్లి గురించి తండ్రి అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానమివ్వక పోవడంతో ఆయన పోలీసులకు తెలిపారు. పోలీసుల విచారణలో కీర్తి అసలు విషయాన్ని బయటపెట్టింది

ఈ నేపథ్యంలో.. తాజా విచారణలో హత్యకు ముందు జరిగిన వివరాలను హంతకులు శశికుమార్, కీర్తిలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 19న రజిత కూరగాయల మార్కెట్ నుంచి వచ్చేసరికి ఇంట్లో కీర్తి, శశికుమార్ కలిసి ఉన్నారు. ఇది చూసి తల్లి ఆగ్రహించడంతో ముగ్గురు ఘర్షణ పడ్డారని చెప్పారు. అనంతరం రజితను అడ్డుదొలగించుకునేందుకు కీర్తి, శశికుమార్ నిర్ణయించుకుని, రజిత లోపల గదిలో ఉండగానే కీర్తి, శశికుమార్ మద్యాన్ని సేవించారన్నారు.

తర్వాత అనుకున్న పథకం ప్రకారం లోపలికి వెళ్లి గడియవేసి.. రజిత అరవకుండా ఆమె మొహంపై కీర్తి తలగడ పెట్టి అదమగా.. శశికుమార్ చున్నీని రజిత గొంతుకు బిగించి హత్య చేశాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేటు వద్ద పడవేసి ఏమీ ఎరగనట్లు ఎవరికి వారు ఉన్నట్లు నటించినప్పటికీ, దొరికిపోయారని పోలీసులు తెలిపారు. తమ విచారణలో మరో విషయం కూడా బయటపడిందని పోలీసులు తెలిపారు.

కీర్తి మొదటి ప్రియుడు బాల్ రెడ్డని తేలిందని.. బాల్ రెడ్డి కీర్తిపై అత్యాచారానికి పాల్పడట్టు నిర్ధారణ కూడా అయిందన్నారు. కీర్తి గర్భం దాల్చడంతో ఆమెకు శశికుమార్ అబార్షన్ చేయించడంతో, అప్పటినుంచి ఆమె శశికుమార్ కు దగ్గరైందని చెప్పారు. ఈ కేసు నేపథ్యంలో శశికుమార్, బాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారన్నారు. హత్య కేసులో బాల్ రెడ్డి పాత్రపై కూడా తాము దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
keerthi
hayathnagar
mother
murder case
Hyderabad

More Telugu News