KCR: 15 మందిని బలి తీసుకున్నావు.. ఇంకెంతమందిని చంపుతావ్?: కేసీఆర్‌పై కోదండరాం ఫైర్

  • సకల జనభేరిలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కోదండరాం
  • కార్మికుల వల్లే నష్టాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • అవసరమైతే ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరిక

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సాయంత్రం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనభేరిలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు.

కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోందంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పటికే 15 మంది కార్మికులను బలితీసుకున్నారని, ఇంకెంతమంది చావాలని ప్రశ్నించారు. చర్చల పేరుతో జేఏసీ నేతలను పిలిచి అవమానించడం తగదన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సభలు, ర్యాలీలు కొనసాగుతాయన్న కోదండరాం.. అవసరమైతే ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.

More Telugu News