Sensex: నేడు కూడా మార్కెట్ దూకుడు.. మరోసారి 40 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్

  • 220 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 57 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • చివరి గంటలో ప్రాఫిట్ బుకింగ్ చేసిన ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను కొనసాగించాయి. జూలై 5వ తేదీ తర్వాత సెన్సెక్స్ మరోసారి 40 వేల మార్కును అధిగమించింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 315 పాయింట్లు పెరిగింది. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052కి పెరిగింది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 11,844 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.37%), టీసీఎస్ (2.63%), ఐటీసీ (2.43%), భారతి ఎయిర్ టెల్ (2.31%), సన్ ఫార్మా (1.90%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-2.41%), మారుతి సుజుకి (-2.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.36%), బజాజ్ ఫైనాన్స్ (-1.32%).

More Telugu News