Devendra Fadnavis: బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవ ఎన్నిక!

  • ధన్యవాదాలు చెప్పిన ఫడ్నవీస్ 
  • ప్రజల తీర్పుపై ఎలాంటి సందేహం లేదు
  • శివసేన డిమాండ్లపై కూర్చుని చర్చిస్తాం
ఇటీవల జరిగిన మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం బీజేపీ,శివసేన సమష్టి కృషి ఫలితమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఈ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మరోసారి నన్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు, ఈ విజయం రెండు పక్షాల సమష్టి కృషికి నిదర్శనం. ప్రజల తీర్పుపై ఎలాంటి సందేహం లేదు. శివసేన భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము’ అని చెప్పారు. శివసేనతో తమ పార్టీకి అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయని, తొందర్లోనే వాటిని పరిష్కరించుకుంటామన్నారు. శివసేన డిమాండ్లపై కూర్చుని చర్చిస్తామని తెలిపారు.
Devendra Fadnavis
Maharashtra

More Telugu News