Arvind Kejriwal: మహిళల స్పందనను తెలుసుకునేందుకట.. బస్సెక్కిన ఢిల్లీ సీఎం!

  • సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం
  • మహిళల స్పందన తెలుసుకునేందుకు బస్సులో ప్రయాణం
  • ప్రతిపక్షాలపై విమర్శలు
దేశ రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన పథకంపై మహిళలు ఎలా స్పందిస్తున్నదీ తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బస్సెక్కారు. సిటీ బస్సులో ప్రయాణించి ఈ పథకంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని ఎప్పటికైనా గొప్పగానే ఉంటుందని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టలేదని, వారి భద్రత కోసం 13వేల మంది మార్షల్స్‌ను నియమించినట్టు సీఎం వివరించారు.
Arvind Kejriwal
New Delhi
city bus
free journey

More Telugu News