Vikram Kumar: విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చరణ్?

  • రాజమౌళి సినిమాతో బిజీగా చరణ్ 
  •  తదుపరి సినిమా కొరటాలతో అంటూ టాక్ 
  • లైన్ తో చరణ్ ను మెప్పించిన విక్రమ్ కుమార్  

ప్రస్తుతం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది జూలై 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమాకి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తరువాత కొరటాలతోనే చరణ్ సినిమా వుంటుందనే టాక్ వినిపించింది.

తాజాగా విక్రమ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత విక్రమ్ కుమార్ ఒక మంచి లైన్ అనుకుని, చరణ్ కి చెప్పారట. ఆ లైన్ చరణ్ కి బాగా నచ్చినట్టుగా సమాచారం. పూర్తి స్క్రిప్ట్ ను తయారుచేసి వినిపించమని చరణ్ చెప్పడంతో, విక్రమ్ కుమార్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ తో చరణ్ ను విక్రమ్ కుమార్ ఒప్పించవలసి వుంది. మరి కొరటాల - విక్రమ్ కుమార్ లలో ఎవరితో ముందుగా చరణ్ సెట్స్ పైకి వెళతాడో చూడాలి.

  • Loading...

More Telugu News