Akshay: ఐదు రోజుల్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన 'హౌస్ ఫుల్ 4'

  • ఈ నెల 26న వచ్చిన 'హౌస్ ఫుల్ 4'
  • 5 రోజుల్లో 111.82 కోట్ల వసూళ్లు 
  • అక్షయ్ కి ఈ ఏడాది మూడో హిట్ 

దీపావళి కానుకగా ఈ నెల 26వ తేదీన 'హౌస్ ఫుల్ 4' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ .. కృతీ సనన్ .. బాబీ డియోల్ .. పూజా హెగ్డే .. రితేశ్ దేశ్ ముఖ్ .. కృతి కర్బందా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా తన సత్తా చూపుతూ దూసుకుపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. 5 రోజుల్లో ఈ సినిమా 111.82 కోట్లను వసూలు చేసింది. అక్షయ్ కుమార్ నుంచి ఈ ఏడాది వచ్చిన 'కేసరి' .. 'మిషన్ మంగళ్' 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. తాజాగా 'హౌస్ ఫుల్ 4' కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస హిట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.

More Telugu News