రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా ఉంది: వైసీపీపై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు
- ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- మరోవైపు వైసీపీ వాళ్ల రంగుల పిచ్చి పెరిగిపోయింది
- ఆఖరికి జాతీయ జెండానూ అవమానిస్తున్నారు
- పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం చట్ట వ్యతిరేకం
'రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా వైసీపీ పాలన ఉంది. ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు వైసీపీ వాళ్ల రంగుల పిచ్చి ఆఖరికి జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చింది.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకం' అని ట్వీట్ చేశారు.