brain: వాళ్ల కన్నా మన మెదళ్లు చిన్నవట.. తాజా అధ్యయనంలో వెల్లడి!

  • ఐఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు 
  • చైనీయులు, కాకేసియన్లు, కొరియన్ల మెదళ్లతో పోల్చి చూసిన పరిశోధకులు  
  • ‘ఇండియన్‌ బ్రెయిన్‌ అట్లాస్’ పేరిట ఓ నివేదిక

భారతీయుల మెదళ్ల పరిమాణంపై ఐఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. చైనీయులు, కాకేసియన్లు, కొరియన్ల మెదళ్లతో పోల్చి చూస్తే భారతీయుల మెదళ్ల పరిమాణం చిన్నగా ఉందని వారు తేల్చారు. వారు ఇటువంటి పరిశోధన చేయడం ఇదే తొలిసారి. భారతీయుల మెదడు ఎత్తు, వెడల్పు, ఘనపరిమాణాలపై అధ్యయనం చేసి ‘ఇండియన్‌ బ్రెయిన్‌ అట్లాస్’ పేరిట ఓ నివేదికను రూపొందించారు.

ఈ పరిశోధనతో తేలిన ఫలితాల వల్ల మెదడు సంబంధిత వ్యాధులను త్వరగా గుర్తించే విధానం కూడా తెలిసిందని చెప్పారు. 50 మంది ఇండియన్ల మెదళ్లను మూడు వేర్వేరు ఆసుపత్రుల్లో ఎంఆర్‌ఐ స్కాన్‌ చేశారు. అనంతరం 100 మంది మెదళ్లపై అధ్యయనం చేశారు. మెదళ్ల ఎత్తు, వెడల్పు, ఘనపరిమాణాలపై మాంట్రియల్‌ న్యూరలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కొలతలను ప్రామాణికంగా తీసుకుంటారు. దాని సాయంతో భారతీయుల మెదళ్ల పరిమాణాలు పోల్చి చూస్తే ఈ వివరాలు తెలిశాయి.

More Telugu News