Archana: పెళ్లి కూతురు కానున్న టాలీవుడ్ నటి అర్చన

  • నవంబర్ 13న నటి వివాహ వేడుక
  • హెల్త్ కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ తో పరిణయం
  • 2004లో ‘తపన’ చిత్రంతో తెలుగు సినీ జగత్తులోకి ప్రవేశం
శ్రీరామదాసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,  పౌర్ణమి, సామాన్యుడు తదితర చిత్రాల్లో మెరిసిన టాలీవుడ్ నటి అర్చన పెళ్లికూతురు కానుంది. నవంబర్ 13న హైదరాబాద్ లో ఆమె పెళ్లి వేడుక జరుగనుంది. హెల్త్ కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్ తో ఈనెల 3న ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అర్చన తెలుగులోనే కాక, మలయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. 2004లో ‘తపన’ చిత్రంతో తెలుగు సినీ జగత్తులోకి ప్రవేశించిన అర్చన ‘నేను’ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. చివరిసారిగా ఆమె వజ్ర కవచధర గోవిందా చిత్రంలో నటించారు.
Archana
Tollywood
Wedding

More Telugu News