Jagan: బాలకృష్ణన్ కమిటీతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్

  • విద్యారంగ సంస్కరణలపై బాలకృష్ణన్ కమిటీ ఏర్పాటు
  • కమిటీతో సమావేశమైన జగన్
  • 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం

ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన ప్రొఫెసర్ బాలకృష్ణన్ కమిటీతో జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,  1 నుంచి 8వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని స్పష్టం చేశారు. 1200 మంది ఉపాధ్యాయులకు రూ.5 కోట్ల ఖర్చుతో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా ఉపాధ్యాయులు ఉండాలని అధికారులకు సూచించారు. అంతేగాకుండా, ఉన్నతవిద్యకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 100 ఎకరాల స్థలం ఉంటేనే అగ్రికల్చర్ కాలేజీకి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News