Telugudesam: గుంటూరు కలెక్టరేట్ ఎదుట రేపు నారా లోకేశ్ నిరసన దీక్ష

  • ఇసుక కొరతపై టీడీపీ పోరాటం
  • రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు లోకేశ్ దీక్ష
  • టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ తన పోరాటాన్ని మరింత పదునెక్కిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇసుక కొరత, తదనంతర పరిణామాలపై నిరసనగా రేపు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించనున్నారు. ఈ నిరసన ప్రదర్శనకు భారీగా టీడీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది.
Telugudesam
Nara Lokesh
Guntur
Andhra Pradesh

More Telugu News