Uttam Kumar Reddy: హుజూర్ నగర్ లో ఓటమితో కాంగ్రెస్ క్యాడర్ లో ఆత్మస్థైర్యం తగ్గింది: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఓటమికి నాదే బాధ్యత 
  • పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్న వీహెచ్ 
  • పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతల చర్చ
ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం తగ్గిందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలతో పోలిస్తే తమ పార్టీ ఈసారి తమ ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు ప్రయత్నం చేసిందని చెప్పారు. 'ఏమైనా ఈ ఓటమికి నాదే బాధ్యత' అని ఆయన చెప్పారు.

గాంధీ భవన్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప ఎన్నికలో ఓటమి, క్రమశిక్షణ ఉల్లంఘన, సభ్యత్వ నమోదు, మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపై నేతలు చర్చించారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ లోపించిందని  అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీఎంలు ఎవరూ కూడా పదవిచేపట్టక ముందే కార్యకర్తలతో సీఎం అని పిలుపించుకోలేదని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ హాజరు కాలేదు. జానారెడ్డి సమావేశం ముగుస్తుందనగా వచ్చారు.
Uttam Kumar Reddy
Congress
Huzurnagar
V Hanumantha Rao

More Telugu News