Allu arjun: బన్నీ 'ఐకాన్' ప్రాజెక్టు అటకెక్కిందట!

  • బన్నీతో 'ఐకాన్' ప్లాన్ చేసిన వేణు శ్రీరామ్ 
  • పూర్తి కథ పట్ల బన్నీ అసంతృప్తి 
  •  సుకుమార్ సినిమాకి పూజా కార్యక్రమాలు

ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. టాకీపార్టును పూర్తి చేసుకున్న ఈ  సినిమా, పాటల చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలోను .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలోను బన్నీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

వేణు శ్రీరామ్ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ముందుగా లైన్ చెప్పినప్పుడు ఓకేనన్న అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ పూర్తి కథను చెప్పిన తరువాత అసంతృప్తిని వ్యక్తం చేశాడట. వేణు శ్రీరామ్ మెప్పించలేకపోయిన కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. ఇక సుకుమార్ తో సినిమా, మైత్రీ మూవీస్ కార్యాలయంలో రేపు పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

More Telugu News