Pakistan: ఇమ్రాన్‌ఖాన్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ‘ఆజాద్ మార్చ్’.. రాజధాని వైపుగా లక్షమంది ఆందోళనకారులు!

  • జమాతే ఉలెమాయె ఇస్లాం పార్టీ ఆధ్వర్యంలో భారీ మార్చ్
  • ప్రతిపక్షాల మద్దతు
  • విరాళాల రూపంలో రూ.100 కోట్ల సేకరణ

ఇమ్రాన్‌‌ఖాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ లక్షమంది ఆందోళనకారులు రాజధాని ఇస్లామాబాద్‌ వైపు బయలుదేరారు. జమాతే ఉలెమాయె ఇస్లాం పార్టీ ఆధ్వర్యంలో ‘ఆజాదీ మార్చ్‌’ పేరుతో ఆదివారం ఈ భారీ ర్యాలీ మొదలైంది. ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉన్న ఈ ర్యాలీ కోసం దాదాపు వంద కోట్ల రూపాయల విరాళాలు సేకరించడం గమనార్హం.

కరాచీ సహా వివిధ నగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాదాపు లక్షమందితో కూడిన ఈ ర్యాలీ ఇస్లామాబాద్ వైపుగా సాగుతోంది. ఈ నెల 31న రాజధానికి చేరుకోనున్న ఈ భారీ మార్చ్ ప్రధానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపించనుంది.

More Telugu News