Narendra Modi: సౌదీ అరేబియాలో మోదీకి ఘన స్వాగతం

  • రెండు రోజుల పర్యటనకు గాను సౌదీ చేరుకున్న మోదీ
  • సౌదీ హైప్రొఫైల్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న ప్రధాని
  • సౌదీ రాజు, యువరాజులతో ద్వైపాక్షిక చర్చలు

సౌదీ అరేబియా భారత్ కు అత్యంత ప్రాధాన్యమైన మిత్రుడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటనకు గాను సౌదీ అరేబియాకు మోదీ వెళ్లారు. నిన్న రాత్రి సౌదీ రాజధాని రియాద్ కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా మూడవ హైప్రొఫైల్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ లో మోదీ పాల్గొంటారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో కూడా పాల్గొంటారు. ఈ చర్చల్లో మోదీతో పాటు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ లు పాల్గొంటారు.

రియాద్ చేరుకున్న తర్వాత మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'సౌదీ అరేబియా చేరుకున్నా. గొప్ప మిత్ర దేశమైన సౌదీతో బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పర్యటన సందర్భంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను' అని తెలిపారు.

మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రధానంగా చమురు, గ్యాస్, పునరుత్పాదక శక్తి, పౌర విమానయానం తదితర కీలక అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి.

More Telugu News