assam: మీరెన్ని చట్టాలు తెచ్చినా.. ముస్లింలు పిల్లల్ని కనడం మాత్రం ఆపరు!: ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్

  • సంతానం ఇద్దరికి మించితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత
  • కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన అసోం
  • ముస్లింలు పట్టించుకోరన్న నేత

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదంటూ అసోం ప్రభుత్వం చేసిన చట్టంపై పార్లమెంటు సభ్యుడు, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని ముస్లింలు ఎవరూ పట్టించుకోరని, వారు పిల్లల్ని కనడాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. దేశంలో ఉద్యోగాలు పొందుతున్న ముస్లింలు రెండు శాతం లోపే ఉన్నారని సచార్ కమిటీ కూడా చెప్పిందని ఈ సందర్భంగా బద్రుద్దీన్ గుర్తు చేశారు.

More Telugu News