EU: ఈయూ బృందం వస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో గ్రనేడ్ దాడి

  • జమ్మూ కశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదుల ఘాతుకం
  • ఆరుగురు పౌరులకు గాయాలు
  • గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి జరిపారు. సోపోర్ బస్టాండ్ సమీపంలో గ్రనేడ్ ను విసరగా ఆరుగురు పౌరులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు చెప్పారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) బృందం రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడానికి  రానున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం భద్రతా బలగాలకు సవాల్ గా పరిణమించింది. అటు, ఆదివారం శ్రీనగర్ లో సీఆర్ పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
EU
Jammu And Kashmir

More Telugu News